Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దోపిడీ చేస్తూ దొరికిన 23 ఏళ్ల 'టిక్‌టాక్' స్టార్

  • టిక్ టాక్ వీడియోలో పాప్యులర్ అయిన షారూఖ్ ఖాన్
  • 40 వేల మంది ఫాలోవర్లు
  • మరో దొంగతనానికి ప్లాన్ చేస్తూ దొరికిన వైనం
మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో ఓ టిక్‌టాక్ స్టార్ సహా నలుగురిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు టిక్‌టాక్ వీడియోలతో బాగా పాప్యులర్ అయ్యాడు. అతడికి ఏకంగా 40 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన స్నేహితులతో కలిసి మరో దొంగతనానికి ప్లాన్ చేస్తుండగా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అల్ఫా 2 ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. షారూఖ్‌తోపాటు పట్టుబడిన మిగతా ముగ్గురిని అసిఫ్, ఫైజాన్, ముకేశ్‌లుగా పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,520 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చోరీల కోసం ఉపయోగించే ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. షారూఖ్ ఖాన్ గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అక్కడ ఉండగానే టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు తీసేవాడని పేర్కొన్నారు. నిందితులు నలుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారిని జైలుకు పంపింది.
TikTok
robbery
Noida

More Telugu News